ఐఏయస్ ట్రయినీలకు సిరిసిల్లా జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్ పాఠాలు

Spread the love

• జాతీయ స్థాయిలో అదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్
• సిరిసిల్ల జిల్లా మోడల్ ని శిక్షణ అంశంగా ఎంచుకున్న ముస్సూరీలోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్
• కరువు కోరల్లో నుంచి జలసిరులు వైపు జిల్లా పయనంపై ప్రశంసలు
• క్షేత్రస్థాయిలో జిల్లాను పరిశీలించేందుకు పలువురి ఆసక్తి
• జిల్లాలోని పలు కార్యక్రమాలను డాక్యూమెంట్ చేసి తమకు పంపాలని కోరిన లాల్ బహదూర్ శాస్ర్తి అకాడమీ అప్ అడ్మినిస్ట్రేషన్
• ఐఏయస్ శిక్షణ అకాడమీలో శిక్షణ అంశంగా జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
• కెసియార్ జల నిర్వహణ నమూనాకి దక్కిన మరో గుర్తింపన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : జాతీయస్థాయిలో సిరిసిల్ల మోడల్ అధ్యయన అంశంగా ప్రశంసలందుకుంటోంది. ఒకప్పుడు సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ సిరిసిల్ల జిల్లా ప్రస్తుతం జాతీయ స్థాయిలో తన జల నిర్వహణ ద్వారా వార్తల్లో నిలుస్తున్నది. కరువు కోరల్లో నుంచి జలసిరులు వైపు సాగించిన జిల్లా పయనంపై అధ్యయనం జరుగుతుంది. భారతదేశంలోని భవిష్యత్తు పాలసీ మేకర్లను తయారుచేసి, పాలన విభాగానికి ప్రాణం పోసే ఐఏయస్ కు ఎంపికయిన అధికారులకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిరిసిల్ల మోడల్ ని అధ్యయన అంశంగా ఎంచుకున్నది. ఈ సంవత్సరం మొదటి దశ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను అధ్యయనం చేసి, అక్కడి శిక్షణ పొందుతున్న అధికారులతో పంచుకున్నది. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా మోడల్ పైన అధ్యయనం చేసిన తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఏయస్ ట్రయినీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.

యువ ఐ.ఎ.ఎస్ అధికారులకు వివిధ అంశాలపైన ముస్సోరీలోని అకాడామీ సమగ్రంగా శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం జాతీయ, అంతర్జాయతీంగా ఉన్న అదర్శవంతమైన పరిపాలనా సంస్కరణలు, పద్దతులు, పనులపైన ప్రత్యేకంగా చర్చింస్తుంది. ఈసారి ఇందుకోసం ఎంచుకున్న శిక్షణ అంశాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ పద్దతుల్లో జిల్లాను అదర్శంగా ఎంచుకున్నది. గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన జల నిర్వహాణ కార్యక్రమాల ద్వారా ఆదర్శవంతంగా నిలిచిన తీరుని ప్రత్యేకంగా పరిశీలించింది. ముఖ్యంగా జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, చిన్న తరహా సాగునీటి కార్యక్రమాల, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకున్న చర్యలు, వాటర్ కన్జర్వేషన్ పద్దతుల వంటి బహుముఖ కార్యక్రమాల ద్వారా జిల్లాలో జరిగిన జల నిర్వహణ కార్యక్రమాలు పైన ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసిన చెరువలు వివరాలు, గ్రామాల్లో తవ్విన ఇంకుడు గుంతలు, స్టాగ్గర్డ్ స్ర్టేచేస్ (ఉపాది హమీలో చేపట్టే వాటర్ కర్జ్వేషన్ పనులు), ఫాం పాండ్స్ వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చర్చించింది.
జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా ఈ సంవత్సరం జిల్లా వాటర్ టేబుల్ 6 మీటర్లు పెరిగింది. గతంలో జిల్లాలోని అన్ని మండలాలు పాక్షిక కరువు ప్రాంతాలుగా గుర్తింపున్న జిల్లాకు ఈ పెరుగుదల ఒక గొప్ప మైలురాయని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ పనుల ద్వారా అనేక గ్రామాల్లోని చెరువులను నింపడం వంటి అంశాలను కూడా పరిశీలన చేసింది. క్షేత్రస్థాయిలో మానవ వ్యర్ధ్యాలను శుద్ధిచేసే (ఫిజికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్- ఎఫ్ ఎస్ టిపి) మరియు డ్రైవ్ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ వంటి వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలు పాడవకుండా కాపాడుకుంటున్న తీరుపైన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. జిల్లాలో సాగించిన జల నిర్వహాణ ద్వారా కరువు కోరల నుంచి దూరమై, శాంతి భద్రతలు కూడా మెరుగుపడ్డాయని పెర్కోంది. జిల్లాకు గత 5 సంవత్సరాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం, జల నిర్వహాణ, స్వచ్చత కార్యక్రమాలతోపాటు ఇతర అనేక అంశాల్లో 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో జాతీయ అవార్డులు లభించాయి. జాతీయ స్ధాయిలో అగ్రగామిగా నిలిచిన ఈ కార్యక్రమాలను డాక్యూమెంట్ చేసి తమకు పంపాలని ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్ర్తి అకాడమీ కోరింది.

సిరిసిల్ల మోడల్ జాతీయస్థాయిలో ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా ప్రశంసలు పొందడం పట్ల స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రి మంత్రి కే. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలసీలు, విధానాలకు జాతీయస్థాయిలో ఇప్పటికే ప్రశంసలు పొందుతున్నాయన్నారు. తర్వలోనే తెలంగాణ జల విధానం పైన అధ్యయనాలు జరుగుతాయని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలు నేడు వాస్తవ రూపం దాలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సిరిసిల్లాకి సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు అందడం ప్రారంభమైందని, అయితే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని దేశంలోనే ఆదర్శవంతమైన జల నిర్వహణకి చిరునామాగా నిలిపే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలోని చెరువులను కాలువలతో కలపడం, సంవత్సరం మొత్తం వాటిలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం ఏర్పడిన జలవనరుల చుట్టూ రిక్రియేషనల్ కార్యక్రమాలు చేపట్టడం వంటి భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు కొనసాగుతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ముస్సూరీ అకాడమీ జిల్లా మోడల్ని అధ్యయనం చేస్తూ యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇవ్వడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది గత ఆరు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు.

జిల్లా మాడల్ ను ప్రసంశించిన పలువురు ట్రయినీ అఫీసర్లు ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. శిక్షణాలో భాగంగా జరిగిన జిల్లా సెషన్ తర్వత ఇక్కడి జిల్లా కలెక్టర్ క్రిష్ణభాస్కర్ తో ప్రత్యేకంగా మాట్లాడి మరింతా సమాచారం తీసుకున్నారు. కాలేశ్వరంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మరియు వాటి నిర్వహణ కోసం భారీ ఎత్తున భూసేకరణ చేసిన తీరు మరియు నిర్వాసితులకు కల్పించిన పునరావాసం వంటి ఈ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పాటించిన కార్యక్రమాలు అత్యంత ఆదర్శవంతంగా ఉన్నాయన్న పలువురు ట్రయినీ ఐఏయస్ లు, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యలపైన చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *